ఇవాళ సాయంత్రం 5 గంటలకు పురపాలక ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయవద్దని ఎస్‌ఈసీ సూచించింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రచారానికి సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సైతం వాడకూడదని హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఎస్‌ఈసీ పేర్కొన్నది. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని యాజమాన్యాలకు తెలియజేసింది. పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఎస్‌ఈసీ తెలిపింది.
సాయంత్రం ముగియనున్న పుర ఎన్నికల ప్రచారం